Bhakti Darbar
हिन्दी

Bhavamulona Bahyamunandunu

భావములోనా బాహ్యమునందును

Stotras · Telugu · Venkateshwara · by Annamacharya

  1. భావములోనా బాహ్యమునందును, గోవింద గోవింద యని కొలువవో మనసా

    Bhavamulona bahyamunandunu, Govinda Govinda yani koluvavo manasa

    In your inner thoughts and in the world outside, worship him, O mind, saying “Govinda, Govinda”.

  2. హరి యవతారములే యఖిలదేవతలు, హరిలోనివే బ్రహ్మాండంబులు, హరినామములే అన్ని మంత్రములు, హరి హరి హరి హరి యనవో మనసా

    Hari yavataramule yakhiladevatalu, Harilonive brahmandambulu, Harinamamule anni mantramulu, Hari Hari Hari Hari yanavo manasa

    All the gods are Hari’s incarnations; all the universes are within Hari; Hari’s names are all the mantras. Say “Hari, Hari, Hari, Hari”, O mind.

  3. విష్ణుని మహిమలే విహితకర్మములు, విష్ణుని పొగడెడి వేదంబులు, విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు, విష్ణువు విష్ణువని వెదకవో మనసా

    Vishnuni mahimale vihitakarmamulu, Vishnuni pogadedi vedambulu, Vishnudokkade visvantaratmudu, Vishnuvu Vishnuvani vedakavo manasa

    The duties we perform are Vishnu’s glories; the Vedas are what praise Vishnu; Vishnu alone is the inner self of the universe. Seek him, O mind, calling “Vishnu, Vishnu”.

  4. అచ్యుతుడితడే ఆదియు నంత్యము, అచ్యుతుడే యసురాంతకుడు, అచ్యుతుడు శ్రీవేంకటాద్రిమీద నిదె, అచ్యుత అచ్యుత శరణనవో మనసా

    Achyutuditade adiyu nantyamu, Achyutude yasurantakudu, Achyutudu Sri Venkatadrimeeda nide, Achyuta Achyuta saranananavo manasa

    Achyuta is the beginning and the end; Achyuta is the slayer of demons; here is Achyuta on Sri Venkata hill. Say “Achyuta, Achyuta, I take refuge in you”, O mind.