भक्ति दरबार
English

ఇక్ష్వాకు కులతిలక

Ikshvaku Kula Tilaka

स्तोत्र · तेलुगु · राम · भद्राचल रामदास

  1. ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె రామచంద్రా, నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా

    Ikshvaku kulatilaka ikanaina palukave Ramachandra, nannu rakshimpakunnanu rakshakulevarinka Ramachandra

    इक्ष्वाकु कुल के तिलक रामचंद्र, अब तो कुछ बोलो। अगर तुम मेरी रक्षा नहीं करोगे तो और कौन रक्षक है?

  2. చుట్టు ప్రాకారములు సొంపుగ చేయిస్తి రామచంద్రా, ఆ ప్రాకారమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా

    Chuttu prakaramulu sompuga cheyisti Ramachandra, aa prakaramunaku batte padivela varahalu Ramachandra

    हे रामचंद्र, मैंने तुम्हारे मंदिर के चारों ओर सुंदर परकोटा बनवाया; उसमें दस हज़ार स्वर्ण मुद्राएँ लगीं।

  3. గోపుర మంటపాలు కుదురుగ గట్టిస్తి రామచంద్రా, నను క్రొత్తగ జూడక నిత్తరి బ్రోవుము రామచంద్రా

    Gopura mantapalu kuduruga gattisti Ramachandra, nanu krottaga judaka nittari brovumu Ramachandra

    हे रामचंद्र, मैंने मज़बूत गोपुर और मंडप बनवाए; मुझे पराया मत समझो, अभी मेरी रक्षा करो।

  4. భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్రా, ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా

    Bharatunaku cheyisti pachchala patakamu Ramachandra, aa patakamunaku batte padivela varahalu Ramachandra

    हे रामचंद्र, मैंने भरत के लिए पन्नों का पदक बनवाया; उसमें दस हज़ार स्वर्ण मुद्राएँ लगीं।

  5. శత్రుఘ్నునకు నేను చేయిస్తి మొలత్రాడు రామచంద్రా, ఆ మొలత్రాడునకు బట్టె మొహరీలు పదివేలు రామచంద్రా

    Satrughnunaku nenu cheyisti molatradu Ramachandra, aa molatradunaku batte moharilu padivelu Ramachandra

    हे रामचंद्र, मैंने शत्रुघ्न के लिए करधनी बनवाई; उसमें दस हज़ार मोहरें लगीं।

  6. లక్ష్మణునకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్రా, ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా

    Lakshmanunaku cheyisti mutyala patakamu Ramachandra, aa patakamunaku batte padivela varahalu Ramachandra

    हे रामचंद्र, मैंने लक्ष्मण के लिए मोतियों का पदक बनवाया; उसमें दस हज़ार स्वर्ण मुद्राएँ लगीं।

  7. సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా, ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా

    Seetammaku cheyisti chintaku patakamu Ramachandra, aa patakamunaku batte padivela varahalu Ramachandra

    हे रामचंद्र, मैंने सीता माँ के लिए इमली के पत्तों जैसा पदक बनवाया; उसमें दस हज़ार स्वर्ण मुद्राएँ लगीं।

  8. వాహనములు మీకు వరుసతో చేయిస్తి రామచంద్రా, జగన్మోహన సంకెళ్ళు వేసిరి కాళ్ళకు రామచంద్రా

    Vahanamulu meeku varusato cheyisti Ramachandra, jaganmohana sankellu vesiri kallaku Ramachandra

    हे रामचंद्र, मैंने तुम्हारे लिए एक के बाद एक वाहन बनवाए; फिर भी, हे जगमोहन, मेरे पैरों में बेड़ियाँ डाल दी गईं।

  9. కలికి తురాయి నీకు పొలుపుగ చేయిస్తి రామచంద్రా, నీవు కులుకుచు తిరిగెద వెవరబ్బ సొమ్మని రామచంద్రా

    Kaliki turayi neeku poluputa cheyisti Ramachandra, neevu kulukuchu tirigeda vevarabba sommani Ramachandra

    हे रामचंद्र, मैंने तुम्हारे लिए सुंदर कलगी बनवाई; तुम उसे पहनकर इतराते घूमते हो, किसके बाप का पैसा समझकर?

  10. మీ తండ్రి దశరథ మహారాజు పెట్టెనా రామచంద్రా, లేక మీ మామ జనక మహారాజు పంపెనా రామచంద్రా

    Mee tandri Dasaratha maharaju pettena Ramachandra, leka mee mama Janaka maharaju pampena Ramachandra

    हे रामचंद्र, क्या तुम्हारे पिता महाराज दशरथ ने यह दिया? या तुम्हारे ससुर महाराज जनक ने भेजा?

  11. అబ్బా తిట్టితినని ఆయాసపడవద్దు రామచంద్రా, ఈ దెబ్బల కోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్రా

    Abba tittitinani ayasapadavaddu Ramachandra, ee debbala korvaka abba tittitinayya Ramachandra

    हे रामचंद्र, मैंने तुम्हें भला-बुरा कहा, इससे दुखी मत होना; इन मारों को सह न पाने के कारण ही मैंने ऐसा कहा।

  12. సర్కారు పైకము తృణముగ నెంచకు రామచంద్రా, దెబ్బల కోర్వను అప్పు దీర్చుమయ్య రామచంద్రా

    Sarkaru paikamu trinamuga nenchaku Ramachandra, debbala korvanu appu deerchumayya Ramachandra

    हे रामचंद्र, सरकारी धन को तिनके जैसा मत समझो; मैं मार नहीं सह सकता, यह कर्ज़ चुका दो।

  13. ఏటికి చల్లిన నీళ్ళాయె నా బ్రతుకు రామచంద్రా, నేను అధములందరికంటె అన్యాయమైతిని రామచంద్రా

    Etiki challina neellaye na bratuku Ramachandra, nenu adhamulandarikante anyayamaitini Ramachandra

    हे रामचंद्र, मेरा जीवन नदी में डाले पानी की तरह व्यर्थ हो गया; मेरे साथ सबसे नीच लोगों से भी बुरा अन्याय हुआ।

  14. కౌసల్య పుత్రుడ దశరథ తనయుడ రామచంద్రా, కావు క్షేమముగ భద్రాద్రి నెలకొన్న శ్రీరామచంద్రా

    Kausalya putruda Dasaratha tanayuda Ramachandra, kavu kshemamuga Bhadradri nelakonna Sri Ramachandra

    कौशल्या के पुत्र, दशरथ के बेटे, भद्राद्रि पर विराजमान श्री रामचंद्र, मुझे कुशल से बचाओ।

  15. భక్తులందరిని పరిపాలించెడి శ్రీరామచంద్రా, నీవు క్షేమముగ రామదాసుని నేలుము రామచంద్రా

    Bhaktulandarini paripalinchedi Sri Ramachandra, neevu kshemamuga Ramadasuni nelumu Ramachandra

    सब भक्तों का पालन करने वाले श्री रामचंद्र, अपने रामदास की भी कुशलपूर्वक रक्षा करो।