Sri Rama Namam Maruvam
శ్రీరామ నామం మరువాం
శ్రీరామ నామం మరువాం మరువాం, సిద్ధము యమునకు వెరువాం వెరువాం
Sri Rama namam maruvam maruvam, siddhamu Yamunaku veruvam veruvam
We will never forget Sri Rama’s name, never; and surely we will never fear Yama, the god of death.
గోవిందునేవేళ గొలుతాం గొలుతాం, దేవుని గుణములు దలుతాం దలుతాం
Govindunevela golutam golutam, devuni gunamulu dalutam dalutam
We will worship Govinda at every hour; we will think on God’s virtues, again and again.
విష్ణు కథలు చెవుల విందాం విందాం, వేరే కథలు చెవుల మందాం మందాం
Vishnu kathalu chevula vindam vindam, vere kathalu chevula mandam mandam
We will listen to Vishnu’s stories with our ears; other tales we will shut out.
రామదాసులు మాకు సారాం సారాం, కామదాసులు మాకు దూరాం దూరాం
Ramadasulu maku saram saram, kamadasulu maku duram duram
Rama’s servants are our very essence; the slaves of desire stay far from us.
నారాయణుని మేము నమ్మేం నమ్మేం, నరులనింక మేము నమ్మాం నమ్మాం
Narayanuni memu nammem nammem, narulanika memu nammam nammam
We trust Narayana, we trust him; we will no longer put our trust in mere men.
మాధవ నామము మరువాం మరువాం, మరి యమబాధకు వెరువాం వెరువాం
Madhava namamu maruvam maruvam, mari yamabadhaku veruvam veruvam
We will never forget Madhava’s name; so we will not fear the torments of Yama.
అవనిజపతి సేవ మానాం మానాం, మరియొక జోలంటే మౌనాం మౌనాం
Avanijapati seva manam manam, mariyoka jolante mounam mounam
We will never give up serving the lord of Sita, daughter of the earth; on any other matter we keep silent.
భద్రగిరీశుని కందాం కందాం, భద్రముతో మనముందాం ఉందాం
Bhadragireesuni kandam kandam, bhadramuto manamundam undam
We will behold the lord of Bhadragiri; and we will live safe and well.